The warning signs that mean a child needs to be seen urgently — and what parents must and must not do first. అత్యవసర పొట్ట సర్జరీ సంకేతాలు
Is your child having a surgical abdominal emergency?
మీ బిడ్డకు అత్యవసర పొట్ట సర్జరీ అవసరమా?
Any one of the following signs can mean a serious problem in the abdomen that may need urgent surgery. Do not wait at home — bring the child to the emergency room immediately.
కింది సంకేతాలలో ఏ ఒక్కటి ఉన్నా అది అత్యవసర సర్జరీ అవసరమయ్యే తీవ్రమైన సమస్య కావచ్చు. ఇంట్లో ఆగవద్దు — వెంటనే ఆసుపత్రికి తీసుకురండి.
1. Severe, constant belly pain
తీవ్రమైన, తగ్గని కడుపు నొప్పి
Pain that prevents sleep, makes the child double over, or causes crying when the belly is touched.
నిద్రపోనివ్వని నొప్పి, నొప్పితో ముందుకు వంగిపోవడం, లేదా పొట్టను తాకినా గట్టిగా ఏడవడం.
2. Green or bilious vomiting
ఆకుపచ్చని రంగు వాంతులు
Vomiting fluid that is bright green or yellowish-green, signalling a blocked bowel loop.
ముదురు ఆకుపచ్చ లేదా పసుపు-ఆకుపచ్చ రంగులో వాంతులు కావడం. ఇది ప్రేగులలో అడ్డంకికి తీవ్ర సంకేతం.
3. High fever with abdominal swelling
జ్వరంతో పాటు పొట్ట ఉబ్బడం
A rigid, tight, or visibly swollen belly accompanied by a sudden high temperature spike.
పొట్ట గట్టిగా మారడం, ఉబ్బడం మరియు దానితో పాటు ఒక్కసారిగా తీవ్రమైన జ్వరం రావడం.
4. Inability to pass gas or stool
గ్యాస్ లేదా మలవిసర్జన కాకపోవడం
No bowel movements or gas for over 24 hours, combined with progressive abdominal bloating.
24 గంటలకు పైగా మలవిసర్జన కాకపోవడం లేదా గ్యాస్ పోకపోవడం, మరియు పొట్ట క్రమంగా ఉబ్బిపోవడం.
5. Blood in stool (currant-jelly stool)
మలంలో రక్తం పడటం
Stool containing dark red blood or mucus, looking like dark currant jelly.
మలంలో ముదురు ఎరుపు రంగు రక్తం లేదా జిగురు పడటం (జెల్లీలా కనిపించడం).
Critical first-aid directives
తల్లిదండ్రులు పాటించవలసిన నియమాలు
- DO NOT give any food, water, or milk.
- DO NOT give painkillers or laxatives.
- GO DIRECTLY to the emergency room.
- ఆహారం, నీరు లేదా పాలు అస్సలు ఇవ్వకండి.
- నొప్పి నివారణ మందులు లేదా విరేచనాల మందులు సొంతంగా వాడకండి.
- ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకురండి.
A note from Dr. Yerra Rajesh
"When in doubt, it is always safer to have the child examined. An early check can prevent a small problem from becoming a major emergency."
"సందేహం ఉంటే, పిల్లవాడిని పరీక్ష చేయించడం ఎప్పుడూ సురక్షితం. త్వరగా చెక్ చేయిస్తే చిన్న సమస్య పెద్ద అత్యవసరంగా మారకుండా ఆపవచ్చు."
NABH Accredited
