A Unit of Sri Lakshmi Venkateswara Nursing Home (Established 1974) 0863-222-3181 | yerrashospital5@gmail.com | NABH Accredited

Hernia in Children

A soft groin or belly-button bulge that appears with crying — why it happens, the warning signs, and the simple day-care surgery that cures it.

All Parent Education Guides

A soft groin or belly-button bulge that appears with crying — why it happens, the warning signs, and the simple day-care surgery that cures it. పిల్లలలో హెర్నియా

What is a hernia?

హెర్నియా అంటే ఏమిటి?

Hernia in Children — illustration

A hernia is a small weakness or opening in the muscle wall of the abdomen or groin. Part of the intestine or fat can push through this opening and form a soft swelling or "bulge".

The most common types in children are:

  • Inguinal hernia — a bulge in the groin, more common in boys
  • Umbilical hernia — a bulge near the belly button
  • Hydrocele — fluid collection in the scrotum, often related to hernia

హెర్నియా అంటే కడుపు లేదా తొడల దగ్గర కండరాల గోడలో చిన్న రంధ్రం లేదా బలహీనత. ప్రేగు లేదా కొవ్వు ఆ రంధ్రం గుండా బయటకు వచ్చి మెత్తటి ఉబ్బుగా కనిపిస్తుంది.

పిల్లల్లో ఎక్కువగా వచ్చే రకాలు:

  • ఇంగ్వినల్ హెర్నియా - తొడల సందులో ఉబ్బు, అబ్బాయిల్లో ఎక్కువ
  • నాభి / బొడ్డు హెర్నియా - బొడ్డు దగ్గర ఉబ్బు
  • హైడ్రోసీల్ - వృషణాల్లో నీరు చేరడం

Why does it happen?

ఎందుకు వస్తుంది?

Babies are born with these small openings. In most children they close on their own. If they don't, the hernia may appear when the child cries, coughs, or strains. It is NOT caused by lifting heavy things or by parents doing something wrong.

పిల్లలు పుట్టినప్పుడే ఈ చిన్న రంధ్రాలతో పుడతారు. చాలా మందిలో అవి తమంతట మూసుకుపోతాయి. మూసుకోకపోతే ఏడ్చినప్పుడు, దగ్గినప్పుడు, బలం పెట్టినప్పుడు హెర్నియా కనిపిస్తుంది. ఇది బరువులు ఎత్తడం వల్ల లేదా తల్లిదండ్రుల తప్పు వల్ల రాదు.

How will I know?

ఎలా గుర్తించాలి?

Hernia in Children — illustration
  • A soft swelling in the groin or near the belly button that appears with crying and goes away with rest
  • The swelling may be more visible in the evening
  • In boys, the swelling can go down into the scrotum
  • ఏడ్చినప్పుడు తొడల సందులో లేదా బొడ్డు దగ్గర మెత్తటి ఉబ్బు వచ్చి, విశ్రాంతి తీసుకుంటే తగ్గడం
  • సాయంత్రం ఉబ్బు ఎక్కువ కనిపించడం
  • అబ్బాయిల్లో ఉబ్బు వృషణాల్లోకి దిగడం

Warning signs — go to hospital immediately

అత్యవసర లక్షణాలు - వెంటనే ఆసుపత్రికి

This is called "strangulation" and needs urgent surgery.

  • The swelling becomes hard, painful, and cannot be pushed back in
  • The child is vomiting, has a swollen tummy, or is very irritable
  • The skin over the swelling turns red or purple

దీనిని "స్ట్రాంగులేషన్" అంటారు. వెంటనే ఆపరేషన్ అవసరం.

  • ఉబ్బు గట్టిగా, నొప్పితో ఉండి లోపలికి నెట్టలేకపోవడం
  • వాంతులు, కడుపు ఉబ్బడం, పిల్లవాడు చిరాకుగా ఉండడం
  • ఉబ్బు పైన చర్మం ఎరుపు లేదా నలుపు రంగులోకి మారడం

How is it diagnosed?

ఎలా నిర్ధారిస్తారు?

By physical examination. Sometimes an ultrasound is done to confirm.

డాక్టర్ పరీక్షతో తెలుస్తుంది. అవసరమైతే స్కాన్ చేస్తారు.

How is it treated?

చికిత్స ఎలా ఉంటుంది?

Hernia in Children — illustration
Hernia in Children — illustration
Hernia in Children — illustration

Surgery is the only permanent cure. Medicines, belts, or home remedies cannot close the hole.

  • A day-care procedure, usually 30–45 minutes, under general anaesthesia by a paediatric surgeon
  • The hole is closed with stitches; no mesh is needed in most children
  • Keyhole / laparoscopic surgery is also an option
  • The child can go home the same day or next morning

Paediatric hernia surgery is very safe and routine. Delaying increases the risk of an emergency.

సురక్షితమైన శాశ్వత చికిత్స ఆపరేషన్ ఒక్కటే. మందులు, బెల్ట్‌లు, ఇంటి చిట్కాలు రంధ్రాన్ని మూయలేవు.

  • అదే రోజు డిశ్చార్జ్, సాధారణంగా 30-45 నిమిషాలు, పీడియాట్రిక్ సర్జన్ పూర్తి మత్తులో చేస్తారు
  • కుట్లుతో రంధ్రం మూస్తాం; ఎక్కువ మందికి మెష్ అవసరం లేదు
  • లాపరోస్కోపీ కూడా చేయవచ్చు
  • అదే రోజు లేదా మరుసటి రోజు ఇంటికి

పిల్లల హెర్నియా ఆపరేషన్ చాలా సురక్షితం. ఆలస్యం చేస్తే అత్యవసరం అయ్యే ప్రమాదం ఉంది.

After surgery: what to expect

ఆపరేషన్ తర్వాత జాగ్రత్తలు

Hernia in Children — illustration
  • Pain: mild for 1–2 days; regular pain medicine helps
  • Bath: sponge bath for 2 days, then normal bathing
  • Food: normal diet from the same day
  • Play: avoid running and jumping for 2 weeks; school after 3–4 days
  • Follow-up: one visit after 1 week
  • నొప్పి: 1-2 రోజులు తేలికపాటి నొప్పి; నొప్పి మందు ఇవ్వాలి
  • స్నానం: 2 రోజులు స్పాంజ్ బాత్, తర్వాత సాధారణ స్నానం
  • ఆహారం: అదే రోజు నుండి అన్నీ తినవచ్చు
  • ఆటలు: 2 వారాలు పరుగు, దూకడం వద్దు; 3-4 రోజుల్లో స్కూల్
  • ఫాలోఅప్: 1 వారం తర్వాత ఒకసారి

Common Parent Questions

A: Recurrence is under 1% when done by a paediatric surgeon.

మళ్లీ వస్తుందా?
పీడియాట్రిక్ సర్జన్ చేస్తే 1% కంటే తక్కువ మళ్లీ వస్తుంది.

A: For an umbilical hernia under 2 years we can observe. For an inguinal hernia we recommend early repair to prevent an emergency.

ఆగి చూడవచ్చా?
2 సంవత్సరాల లోపు నాభి హెర్నియా అయితే ఆగవచ్చు. ఇంగ్వినల్ హెర్నియా అయితే త్వరగా ఆపరేషన్ మంచిది.

A: No. When done carefully, it does not affect the testis or future fertility.

భవిష్యత్తులో సంతానోత్పత్తిపై ప్రభావం ఉంటుందా?
లేదు. జాగ్రత్తగా చేస్తే వృషణాలకు లేదా భవిష్యత్ సంతానానికి ఇబ్బంది ఉండదు.

A: Yes, both sides can be repaired under the same anaesthesia.

రెండు వైపులా ఉంది. రెండింటికీ ఒకేసారి చేస్తారా?
అవును. ఒకే మత్తులో రెండు వైపులా చేయవచ్చు.

A note from Dr. Yerra Rajesh

"Most hernias are simple to treat. The key is early diagnosis. If you notice a bulge, get it checked — do not wait for it to become an emergency."

"చాలా హెర్నియాలు సులభంగా నయం అవుతాయి. ముఖ్యం ఏమిటంటే త్వరగా గుర్తించడం. ఉబ్బు కనిపిస్తే వెంటనే చెక్ చేయించుకోండి. అత్యవసరం అయ్యే వరకు ఆగవద్దు."

Dr. Yerra Rajesh

Dr. Yerra Rajesh

M.S., M.Ch., MRCS

Managing Director | Paediatric, Neonatal and Paediatric Urology Surgeon

View Profile

Consult Us

If you have noticed a symptom, an early check is always safer. Our team is here to help.

Book an Appointment 0863-222-3181

Need a Consultation?

Speak with our hospital team to book an appointment or obtain general information about our services.