Swelling of the kidney from a urine blockage — often found on a pregnancy scan. Early detection and follow-up protect kidney function. పిల్లలలో హైడ్రోనెఫ్రోసిస్
What is hydronephrosis?
హైడ్రోనెఫ్రోసిస్ అంటే ఏమిటి?
Our kidneys make urine. Urine flows from the kidney, through a tube called the ureter, to the bladder, and out of the body. Hydronephrosis means swelling of the kidney because urine is not draining properly — it backs up and collects in the kidney. It can affect one or both kidneys.
మన మూత్రపిండాలు మూత్రాన్ని తయారు చేస్తాయి. మూత్రం మూత్రపిండం నుండి యూరేటర్ అనే గొట్టం ద్వారా మూత్రాశయానికి, అక్కడి నుండి బయటకు వెళ్తుంది. హైడ్రోనెఫ్రోసిస్ అంటే మూత్రం సరిగా బయటకు వెళ్లకపోవడం వల్ల మూత్రపిండం ఉబ్బడం. ఇది ఒకటి లేదా రెండు మూత్రపిండాల్లో రావచ్చు.
Why does it happen?
ఎందుకు వస్తుంది?
Common causes in children:
- UPJ obstruction: blockage where the kidney meets the ureter — the most common cause
- VUR / reflux: urine flows back from the bladder to the kidney; also a stone or narrowing in the ureter
- Posterior urethral valves: in boys, a valve blocks urine flow
- Detected on a pregnancy scan: many babies are born with mild hydronephrosis
పిల్లల్లో సాధారణ కారణాలు:
- UPJ అడ్డు: మూత్రపిండం, యూరేటర్ కలిసే చోట బ్లాక్ - ఎక్కువగా ఇదే
- VUR / రిఫ్లక్స్: మూత్రాశయం నుండి మూత్రం మళ్లీ మూత్రపిండానికి వెనక్కి రావడం; రాయి లేదా యూరేటర్ ఇరుకు
- పోస్టీరియర్ యురేత్రల్ వాల్వ్: అబ్బాయిల్లో మూత్ర మార్గంలో వాల్వ్ అడ్డు
- గర్భంలో స్కాన్‌లో తెలియడం: చాలా మంది పిల్లలకు పుట్టుకతో తేలికపాటి హైడ్రోనెఫ్రోసిస్ ఉంటుంది
Signs & symptoms
లక్షణాలు
Many children have no symptoms and it is found during an ultrasound for other reasons. When symptoms come:
- Pain in the side or back, especially after drinking a lot of fluid
- Fever with chills — due to kidney infection
- Frequent urinary infections (UTIs)
- Blood in the urine
- Poor weight gain in infants
చాలా మంది పిల్లలకు ఏ లక్షణాలు ఉండవు. వేరే కారణంతో స్కాన్ చేసినప్పుడు తెలుస్తుంది. లక్షణాలు వస్తే:
- పక్కన లేదా వీపులో నొప్పి, ఎక్కువ నీరు తాగిన తర్వాత
- జ్వరం + వణుకు - మూత్రపిండ ఇన్ఫెక్షన్ వల్ల
- తరచుగా మూత్ర ఇన్ఫెక్షన్
- మూత్రంలో రక్తం
- చిన్న పిల్లల్లో బరువు పెరగకపోవడం
How is it diagnosed?
ఎలా నిర్ధారిస్తారు?
- Ultrasound of the abdomen: the first test — shows the swelling and its grade
- VCUG: checks for urine reflux, done with a catheter
- DTPA / MAG3 renogram: a nuclear scan to check how well the kidney is working and draining
- Blood tests: to check kidney function
- కడుపు స్కాన్ / అల్ట్రాసౌండ్: మొదటి పరీక్ష — ఉబ్బు, గ్రేడ్ తెలుస్తుంది
- VCUG: రిఫ్లక్స్ ఉందా అని చెక్, గొట్టం ద్వారా
- DTPA/MAG3 రీనోగ్రామ్: న్యూక్లియర్ స్కాన్, మూత్రపిండం పని, డ్రైనేజ్ చెక్
- రక్త పరీక్షలు: మూత్రపిండ పని తనిఖీ
Grades (due to reflux)
గ్రేడ్లు (రిఫ్లక్స్)
- Grade 1–2: mild — often improves on its own
- Grade 3–5: moderate to severe — needs close follow-up and sometimes surgery
- గ్రేడ్ 1-2: తేలికపాటి — తమంతట తగ్గవచ్చు
- గ్రేడ్ 3-5: మోస్తరు నుండి తీవ్రం — దగ్గరగా ఫాలోఅప్, కొన్నిసార్లు ఆపరేషన్
Treatment
చికిత్స
Treatment depends on the cause, grade, and kidney function.
- Observation: for mild cases, especially in babies — repeat the scan every 3–6 months; many improve
- Medicines: antibiotics to prevent UTIs if reflux is present, and pain medicine if needed
- Surgery: needed if kidney function is decreasing, there is severe pain or repeated infection, or grade 3–4 with poor drainage
- Common surgeries: pyeloplasty (removes the UPJ blockage, keyhole possible), ureteric reimplantation (for reflux), and valve ablation (for boys with posterior urethral valves)
Success rate is over 95%, and kidney function can improve after surgery.
చికిత్స కారణం, గ్రేడ్, మూత్రపిండ పనితీరుపై ఆధారపడుతుంది.
- గమనించడం: తేలికపాటి కేసుల్లో, ముఖ్యంగా బేబీల్లో — ప్రతి 3-6 నెలలకు స్కాన్; చాలా మందికి తగ్గుతుంది
- మందులు: రిఫ్లక్స్ ఉంటే UTI రాకుండా యాంటీబయోటిక్స్, అవసరమైతే నొప్పి మందు
- ఆపరేషన్: మూత్రపిండ పని తగ్గితే, తీవ్ర నొప్పి/మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్, లేదా గ్రేడ్ 3-4 తో డ్రైనేజ్ బాగోలేకపోతే
- సాధారణ ఆపరేషన్లు: పైలోప్లాస్టీ (UPJ బ్లాక్ తీయడం, కీహోల్), యూరేటర్ రీ-ఇంప్లాంటేషన్ (రిఫ్లక్స్‌కు), వాల్వ్ తొలగింపు (PUV ఉంటే)
విజయం రేటు 95% కంటే ఎక్కువ; ఆపరేషన్ తర్వాత మూత్రపిండ పని మెరుగుపడుతుంది.
Care at home
ఇంటి జాగ్రత్తలు
- Drink enough water: 6–8 glasses per day
- Complete the full course of antibiotics if given
- Do not miss regular follow-up scans
- Watch for fever, pain, or burning while passing urine
- Healthy diet; low salt if advised
- తగినంత నీరు: రోజుకు 6-8 గ్లాసులు
- ఇచ్చిన యాంటీబయోటిక్స్ కోర్సు పూర్తి చేయాలి
- రెగ్యులర్ స్కాన్లు మిస్ చేయవద్దు
- జ్వరం, నొప్పి, మూత్రం వచ్చేటప్పుడు మంట గమనించాలి
- ఆరోగ్యకరమైన ఆహారం; డాక్టర్ చెప్తే ఉప్పు తక్కువ
Common Parent Questions
A: If treated early, the kidney recovers well. Delay can cause damage.
మూత్రపిండం శాశ్వతంగా పాడవుతుందా?
త్వరగా చికిత్స చేస్తే మూత్రపిండం కోలుకుంటుంది. ఆలస్యం అయితే నష్టం వస్తుంది.
A: Yes — except during an infection, or for 4–6 weeks after surgery.
పిల్లవాడు ఆడవచ్చా?
అవును — ఇన్ఫెక్షన్ సమయంలో లేదా ఆపరేషన్ తర్వాత 4-6 వారాలు తప్ప.
A: It depends on the cause — some causes affect both, some only one.
రెండవ మూత్రపిండానికి వస్తుందా?
కారణాన్ని బట్టి ఉంటుంది.
A: Many mild cases resolve after birth; an ultrasound after birth is needed to confirm.
గర్భంలో స్కాన్‌లో తెలిసింది. ప్రమాదమా?
చాలా తేలికపాటివి పుట్టిన తర్వాత తగ్గుతాయి. పుట్టిన తర్వాత స్కాన్ అవసరం.
A note from Dr. Yerra Rajesh
"Hydronephrosis is not a disease, it is a sign of blockage. Early detection and proper follow-up can save kidney function. Do not ignore repeated urine infections or pain."
"హైడ్రోనెఫ్రోసిస్ ఒక వ్యాధి కాదు, ఇది అడ్డు ఉందనడానికి గుర్తు. త్వరగా గుర్తించి సరైన ఫాలోఅప్ చేస్తే మూత్రపిండాన్ని కాపాడుకోవచ్చు. మళ్లీ మళ్లీ మూత్ర ఇన్ఫెక్షన్ లేదా నొప్పిని నిర్లక్ష్యం చేయవద్దు."
NABH Accredited
