A Unit of Sri Lakshmi Venkateswara Nursing Home (Established 1974) 0863-222-3181 | yerrashospital5@gmail.com | NABH Accredited

Undescended Testis

Also called cryptorchidism — why treating it early protects fertility and prevents future problems, with best surgery between 6 and 18 months.

All Parent Education Guides

Also called cryptorchidism — why treating it early protects fertility and prevents future problems, with best surgery between 6 and 18 months. వృషణం కిందికి దిగకపోవడం

What is undescended testis?

వృషణం కిందికి దిగకపోవడం అంటే ఏమిటి?

Undescended Testis — illustration

In a baby boy, the testicles develop in the abdomen and normally move down into the scrotum before birth. Undescended testis means one or both testicles have not moved down into the scrotum. It is common in preterm babies and usually corrects by 6 months. It is also called cryptorchidism.

అబ్బాయి పుట్టక ముందు వృషణాలు కడుపులో ఏర్పడి సాధారణంగా పుట్టేలోపు స్క్రోటంలోకి దిగుతాయి. వృషణం కిందికి దిగకపోవడం అంటే ఒకటి లేదా రెండు వృషణాలు స్క్రోటంలోకి రాకపోవడం. అకాలంగా పుట్టిన పిల్లల్లో ఇది సాధారణం. చాలా సార్లు 6 నెలల్లో తమంతట దిగుతుంది. దీనిని క్రిప్టార్కిడిజం అని కూడా అంటారు.

Why is it important to treat?

చికిత్స ఎందుకు ముఖ్యం?

Undescended Testis — illustration

Keeping the testis inside the abdomen is harmful because body temperature is too hot for it. If not treated, it can cause:

  • Infertility later — reduced sperm production
  • Increased risk of testicular cancer in adult life
  • Torsion or hernia — risk of the testis twisting, or a hernia
  • Psychological issues in the teenage years

Early surgery gives the best results.

వృషణం కడుపులోనే ఉంటే శరీర వేడి ఎక్కువగా ఉండి నష్టం చేస్తుంది. చికిత్స చేయకపోతే:

  • భవిష్యత్తులో సంతానలేమి - స్పెర్మ్ తక్కువగా ఉత్పత్తి
  • వృషణ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది
  • మెలితిరగడం / హెర్నియా వచ్చే ప్రమాదం
  • యుక్త వయసులో మానసిక సమస్యలు

త్వరగా ఆపరేషన్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

How will I know?

ఎలా గుర్తించాలి?

Undescended Testis — illustration
  • An empty scrotum on one or both sides
  • Sometimes the testis can be felt in the groin
  • Retractile testis: comes down with a warm bath but goes up when cold — this is normal and not a problem

Check at birth and during every vaccination visit.

  • ఒకవైపు లేదా రెండు వైపులా స్క్రోటం ఖాళీగా ఉండడం
  • కొన్నిసార్లు తొడల సందులో వృషణం తగులుతుంది
  • రిట్రాక్టైల్ వృషణం: వేడి నీటి స్నానంతో దిగి, చల్లగా ఉంటే పైకి వెళ్లడం — ఇది సాధారణం, సమస్య కాదు

పుట్టినప్పుడు మరియు ప్రతి వ్యాక్సిన్ వద్ద చెక్ చేయించాలి.

Diagnosis

నిర్ధారణ

  • Physical examination by a paediatric surgeon
  • Ultrasound — to find the location of the testis if not felt
  • Hormone tests — rarely needed
  • పీడియాట్రిక్ సర్జన్ పరీక్ష
  • స్కాన్ - వృషణం తగలకపోతే ఎక్కడ ఉందో చూడడానికి
  • హార్మోన్ పరీక్షలు - అరుదుగా అవసరం

Treatment

చికిత్స

Undescended Testis — illustration
Undescended Testis — illustration

Surgery is the treatment — medicines and hormones do not work. The operation is called orchidopexy.

  • Best age: 6 months to 18 months; latest by 2 years
  • A day-care procedure of 45–60 minutes under general anaesthesia
  • The testis is brought down into the scrotum and fixed there
  • Laparoscopic surgery is used if the testis is inside the abdomen
  • Success rate: over 95%

Delaying beyond 2 years reduces fertility potential.

చికిత్స ఆపరేషన్ ఒక్కటే — మందులు/హార్మోన్లు పనిచేయవు. దీనిని ఆర్కిడోపెక్సీ అంటారు.

  • మంచి వయసు: 6 నెలల నుండి 18 నెలలు; గరిష్టంగా 2 సంవత్సరాలలోపు
  • అదే రోజు డిశ్చార్జ్, 45-60 నిమిషాలు పూర్తి మత్తులో
  • వృషణాన్ని కిందికి తెచ్చి స్క్రోటంలో కుట్లుతో స్థిరంగా ఉంచుతాం
  • కడుపులో ఉంటే లాపరోస్కోపీతో చేస్తాం
  • విజయం రేటు: 95% కంటే ఎక్కువ

2 సంవత్సరాల తర్వాత ఆలస్యం చేస్తే సంతాన సామర్థ్యం తగ్గుతుంది.

After surgery

ఆపరేషన్ తర్వాత

  • Pain: mild for 2–3 days; pain medicine is given
  • Bath: after 48 hours
  • Activity: no running or cycling for 2 weeks
  • Follow-up: check at 1 week, 3 months and 1 year
  • Scar: very small, fades over time
  • నొప్పి: 2-3 రోజులు తేలికపాటి నొప్పి; నొప్పి మందు ఇస్తాం
  • స్నానం: 48 గంటల తర్వాత
  • ఆటలు: 2 వారాలు పరుగు/సైక్లింగ్ వద్దు
  • ఫాలోఅప్: 1 వారం, 3 నెలలు, 1 సంవత్సరం చెకప్
  • మచ్చ: చాలా చిన్నది, కాలక్రమంలో పోతుంది

Common Parent Questions

A: No. If operated on time, sexual function and appearance are normal, and fertility is better than if left untreated.

మగతనం లేదా పెళ్లిపై ప్రభావం ఉంటుందా?
లేదు. సకాలంలో ఆపరేషన్ చేస్తే సాధారణ జీవితం ఉంటుంది.

A: No. After 6 months, spontaneous descent is very rare; surgery is needed.

1 సంవత్సరం తర్వాత తమంతట దిగుతుందా?
లేదు. 6 నెలల తర్వాత తమంతట దిగడం చాలా అరుదు; ఆపరేషన్ అవసరం.

A: No. It is due to natural development — not your fault.

గర్భంలో నేను చేసిన దాని వల్ల వచ్చిందా?
లేదు. ఇది సహజ అభివృద్ధి వల్ల. మీ తప్పు కాదు.

A: Yes. Both can be done under the same anaesthesia.

రెండు వైపులా ఉన్నాయి. ఒకేసారి చేస్తారా?
అవును. ఒకే మత్తులో రెండూ చేయవచ్చు.

A note from Dr. Yerra Rajesh

"Don't wait beyond 9 months. Early orchidopexy protects fertility and prevents cancer risk. A simple check at birth can make a big difference in your son's future."

"9 నెలలకు మించి ఆలస్యం చేయవద్దు. త్వరగా ఆపరేషన్ చేస్తే సంతాన సామర్థ్యం కాపాడబడుతుంది మరియు క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. పుట్టినప్పుడు ఒకసారి చెక్ చేయడం మీ అబ్బాయి భవిష్యత్తుకు చాలా ముఖ్యం."

Dr. Yerra Rajesh

Dr. Yerra Rajesh

M.S., M.Ch., MRCS

Managing Director | Paediatric, Neonatal and Paediatric Urology Surgeon

View Profile

Consult Us

If you have noticed a symptom, an early check is always safer. Our team is here to help.

Book an Appointment 0863-222-3181

Need a Consultation?

Speak with our hospital team to book an appointment or obtain general information about our services.